Last Rites | అధికార లాంచ‌నాల‌తో టిటిడి ఆస్థాన విద్వాంసులు గ‌రిమెళ్ల అంత్య‌క్రియ‌లు పూర్తి

తిరుపతి: టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. మంగళవారం ఉదయం తిరుపతి భవానీనగర్లో బాలకృష్ణ ప్రసాద్ నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం హరిశ్చంద్ర శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా, బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి ఆయన ఇద్దరు కుమారులు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాలకృష్ణ ప్రసాద్కు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

Leave a Reply