జేకే మల్టీకేర్ హాస్పిటల్ లో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు సాంకేతిక పద్ధతులతో శస్త్రచికిత్సలు అందించాలనే లక్ష్యంతో జేకే మల్టీకేర్ హాస్పిటల్ లో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంబించినట్లు డాక్టర్ కలాం తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ తన్నీరు మల్లికార్జున్ చేతుల మీదుగా ల్యాప్రోస్కోపిక్ సెంటర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆధునిక వైద్యరంగంలో ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య నిపుణులు డాక్టర్ కలాం మాట్లాడుతూ… ఆధునిక పరికరాలతో కూడిన ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో గాల్ బ్లాడర్, అపెండిక్స్, హెర్నియా, కడుపు లోని ఇతర అనేక శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించవచ్చని తెలిపారు.

ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స సమయంలో శరీరంపై పెద్ద కోతలు అవసరం లేకుండా కేవలం చిన్న రంధ్రాల ద్వారా కెమెరా, ప్రత్యేక పరికరాల సహాయంతో శస్త్రచికిత్స నిర్వహిస్తారని కెమెరా ద్వారా లోపలి భాగాలను స్పష్టంగా చూడగలిగే అవకాశం ఉండటంతో శస్త్రచికిత్సను మరింత ఖచ్చితంగా చేయవచ్చని డాక్టర్ కలాం వివరించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ జక్కుల మల్లయ్య, కోడి జ్యోతి ఉపేందర్, హాస్పటిల్ మేనేజ్మెంట్ ఖలీల్ అహ్మద్ ఖాన్, షేక్ లతీఫ్, నాయకులు షేక్ సైదా, జేసీబీ షఫీ, యం.డీ లతీఫ్, లైటింగ్ జాని, చాంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply