Land Problems | రాష్ట్రంలోనే తొలిసారిగా…

Land Problems | రాష్ట్రంలోనే తొలిసారిగా…

  • 22A కేసుల పరిష్కారంపై ఏలూరులో ప్రత్యేక వేదిక…
  • గత ప్రభుత్వం రాజకీయ కక్షల కారణంగా భూ సమస్యలు పెరిగాయి…
  • జిల్లాలోని 22A భూ సమస్యలలో 90 శాతం ఈరోజే పరిష్కరిస్తాం….
  • దేవాదాయ భూములు, వంటి వాటిని
  • 1 లేదా2 వారాల్లో పరిష్కారానికి అధికారుల చర్యలు
  • ‘మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక’లో
  • వినతులను అక్కడికక్కడే పరిష్కరించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్
Land Problems

Land Problems | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22A భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు జిల్లా మార్గదర్శకం అవుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అండ్ జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో ఇవాళ‌ ‘మెగా 22Aభూ సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసి అభిషేక్ గౌడ, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, డా.కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, ప్రభృతులు పాల్గొన్నారు.

Land Problems

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం చేసిన రాజకీయ కక్షల కారణంగా రాష్ట్రంలో 22A భూ సమస్యలు అతిపెద్ద సమస్యగా రూపొందాయని, ప్రైవేట్ భూములను కూడా ఉద్దేశ్యపూర్వకంగా 22A జాబితాలో చేర్చారని, గత ప్రభుత్వ నేతలకు అనుకూలంగా లేని వారి భూములను 22A, చుక్కలు భూములు వంటి వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారన్నారు. దీని కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

Land Problems

22A కింద నమోదైన భూముల్లో జిరాయితీ భూములు ఉండడంతో సదరు భూయజమానులు తమ భూములు అమ్ముకునేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని జిల్లాలోనూ 22A కింద పొరపాటుగా నమోదైన భూములను సదరు జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారన్నారు. జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, ప్రజలు 22A జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల వివరాలను సదరు యజమానులు నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈరోజు కలెక్టరేట్ లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని పరిశీలించి 90శాతం వరకు అదేరోజు పరిష్కరించడం జరుగుతుందన్నారు. దేవాదాయ భూములు వంటి సమస్యలున్న భూములను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో 1 లేదా 2 వారాలలో తప్పనిసరిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

Land Problems

22Aభూ సమస్యల పరిష్కార విషయంలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి మనోహర్ చెప్పారు. జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ్, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, జిల్లా సర్వే అధికారి అన్సారీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, జిల్లాలోని 27 మండలాల తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మెగా క్యాంపున‌కు ప్రజలనుండి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు, రైతులు పెద్దఎత్తున వచ్చి తమ భూ సమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందించారు. ఇంచార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తమ భూ సమస్యలపై స్వయంగా దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని వెంటనే చర్యలు తీసుకోవడంపై జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, రైతులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు.

Land Problems
Land Problems
Land Problems

Leave a Reply