ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురంలో దారుణం చోటుచేసుకుంది. నాగూర్ వలి అనే యువకుడిపై మరో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నాగూర్‌తో ఉన్న మరో మహిళకు కూడా గాయాలయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. భూమి విషయంలో ఇద్దరి యువకులకు గొడవలు జరిగాయని, ఆ క్రమంలోనే ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో నాగూర్ వలి 80 శాతం కాలిపోగా.. అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.