వైభవంగా లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం

వైభవంగా లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం
పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి (Sri Lakshmi Narsimha Swamy) రథోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కోర మీసాలు, పట్టె నాణాలు, ఇతర వస్తువులు స్వామివారికి భక్తులు ముడుపులుగా చెల్లించుకున్నారు.
పూజారులు రామాచార్యులు (RamaCharyulu), శ్రీధరా చార్యులు (Sridhara Charyulu) , కొండపాక శ్రీకాంత్ చార్యులు (Kondapaka Srikanth Charyulu) ఆద్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు, అభిషేకాలు చేశారు. కోరిన కోర్కెలు తీరాలని భక్తులు స్వామి వారిని వేడుకున్నారు.
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈఓ ముద్దసాని శంకరయ్య, చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య, ధర్మకర్తలు శ్రీపతి సుమన్, ఆడెపు సౌందర్య వెంకటేష్, ముడుసు శ్రీనివాస్, ఇట్యాల సతీష్, తాళ్ళపల్లి రాజమౌళి, గాజుల సురేష్, నాయకులు బొక్కల సంతోష్, తలారి సాగర్, తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్దపల్లి ఏసిపి కృష్ణ నేతృత్వంలో సీఐలు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
