Kyathampally |అలా చేస్తే కఠిన చర్యలు..

Kyathampally | అలా చేస్తే కఠిన చర్యలు..

Kyathampally, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణంలో అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారన్న ఫిర్యాదులు పెద్దఎత్తున వస్తున్నాయని మందమర్రి ఎమ్మార్వో (MRO) సతీష్ తెలిపారు. ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయడం, ప్లాట్లు చేసి విక్రయించడం పూర్తిగా చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు. ప్రభుత్వ (Govt) అనుమతులు లేని ప్లాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరాదని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

అసైన్డ్ భూముల్లో అక్రమ ప్లాట్లు చేసి విక్రయించిన వారి మీద తప్పనిసరిగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలోని మూతపడిన పాఠశాల భూములను సైతం ప్లాట్లుగా మార్చి విక్రయించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని, అట్టి భూములను మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Leave a Reply