Kutami | అదే లక్ష్యంగా..
Kutami, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు సరఫరా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే (MLA) వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో గ్రామాల్లో త్రాగునీటి వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో త్రాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే రాము గురువారం సమీక్షించారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనుల జాబితా… త్వరలో మంజూరు కాలు ఉన్న ప్రతిపాదనలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. అభివృద్ధి పనుల పై అధికారులకు ఎమ్మెల్యేలను పలు సూచనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము (Mla Ramu) మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో త్రాగునీటి వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. త్రాగునీటి వ్యవస్థలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో గుడ్లవల్లేరు మండలంలోనీ వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు, పెంజేండ్ర, గాదెపూడి, కట్టవాని చెరువు, తాడిచర్ల, లంకా దొడ్డి, పెసరమిల్లి గ్రామాల్లో కోటి యాభై లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. నందివాడ మండలం ఓద్దుల మేరక గ్రామంలో 10 లక్షల విధులతో కల్వర్టు పనులు చేపడుతున్నాం అన్నారు.
నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో నీటి వ్యవస్థల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపామని అవి త్వరలో ఆమోదం పొందుతాయని ఎమ్మెల్యే రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ శ్రీనివాస్, ఏ.ఈ రూపేష్, గుడివాడ ఆర్డబ్ల్యూఎస్ ఇంచార్జ్ రాణి తదితరులు పాల్గొన్నారు.

