Kurnool | శ్రీ రామేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు…

Kurnool | శ్రీ రామేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు…

Kurnool | ఓర్వకల్, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వర స్వామికి అమ్మవార్లకు తెలంగాణ హైకోర్టు జడ్జ్ ప్రవీణ్ కుమార్ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు తెలంగాణ హైకోర్టు జడ్జి కాల్వబుగ్గకు రావడంతో ఆయనకు కరోబుగ్గ కార్యనిర్వాహణాధికారి మద్దిలేటి ఆధ్వర్యంలో అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జడ్జి వెంట ఓర్వకల్ తాసిల్దార్ విద్యాసాగర్ ఉన్నారు. ఆయనకు అర్చకులు విశిష్టతను గురించి వివరించారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. పండితులు జడ్జి దంపతులకు దేవాదాయ శాఖ ఆచరణ ప్రకారం ఆశీర్వదించారు. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామిని దర్శించుకోవడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని జడ్జి తెలిపారు.

Leave a Reply