Kurnool | పందేల జోలికెళ్లొద్దు..

Kurnool | పందేల జోలికెళ్లొద్దు..
- డీఐజీ, కర్నూలు ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్
Kurnool | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండగ నేపథ్యంలో పందేల జోలికెళ్లొద్దని డీఐజీ, కర్నూలు ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎవరైనా జూదం, పేకాట, కోడి పందేలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడి పందెంలు, జూదాలు, ఇతర చట్టవ్యతిరేక ఆటలు పూర్తిగా నిషేధమన్నారు. ఎవరైనా కోడి పందేలు ఆడినా, ప్రోత్సహించినా, నిర్వహించినా చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటివి నిర్వహిస్తే డయల్ 112కు గానీ లేదా డయల్ 100కు గానీ, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు.
