Kuntala | మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి

Kuntala | మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్ డిఆర్డిఓ చరణ్ దాస్

Kuntala | కుంటాల ఆంధ్రప్రభ : ఫిబ్రవరి మహిళా సంఘాల అభివృద్ధికి వివోఏలు గ్రామాల్లో పనిచేయాలని అడిషనల్ డి ఆర్ డి ఓ చరణ్ దాస్ అన్నారు శుక్రవారం ఐకెపి కార్యాలయంలోని వివోఏలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా మహిళా సంఘాలకు రుణాలను అందించాలని రుణాలను సకాలంలో చెల్లించే విధంగా చూడాలని తెలియజేశారు రికార్డులను సైతం ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని పేర్కొన్నారు విధులు ఎలా నిర్వహించాలనే దానిపై అవగాహన కల్పించారు.

శ్రీనిధి రుణాలతో పాటు తదితర బకాయిలపై సమావేశంలో వివో ఏ లకు పలు సూచనలు తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో మహిళా సంఘాల అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి నెలకోసారి సదరం క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని గ్రామాల్లో వివోఏలు ప్రతి ఒక్కరికి తెలియపరచాలని పేర్కొన్నారు దీని ద్వారా ఎందరో మంది లబ్ధి చేకూరుతారని కొంతమంది తెలియక ఇబ్బందులు పడుతున్నారని స్లాట్ బుకింగ్ సైతం చేయించేలా కృషి చేయాలని వారికి సూచించారు ఐ కెపిలో పనిచేసే పలు రకాల పనులపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిపిఎం గంగన్న ఏపీఎం లక్ష్మణ్ సిసి లు పెంటన్న ముత్యం యూసుఫ్ అకౌంటెంట్ శివప్రసాద్ వివో ఏలు ఐ కెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply