KTR | డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది…

KTR | డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది…
KTR | డ్రగ్స్ ఘటనపై స్పందించిన మాజీమంత్రి కేటీఆర్
మాదకద్రవ్యాలు మానవులను రాక్షసులను చేస్తాయి
డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది
రాజకీయాలకు అతీతంగా శిక్షలు పడాలి
పీసీసీ మహేష్ కుమార్ సూచనను స్వాగతిస్తున్నా
ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని చాలా సార్లు చెప్పా
ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ టెస్టును స్వాగతిస్తా
మాజీమంత్రి కేటీఆర్
KTR | ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ : మొయినాబాద్ డ్రగ్స్ ఘటనపై మాజీమంత్రి కేటీఆర్ స్పందించారు. డ్రగ్స్ మనుషులను రాక్షసులుగా మారుస్తుందని కేటీఆర్ అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులే మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం దురదృష్టకరమని తెలిపారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, ప్రోత్సహించిన వారికి రాజకీయాలకు అతితంగా చట్టం ప్రకారం శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే డ్రగ్స్‌కేసును రాజకీయంగా ఉపయోగిస్తూ బీఆర్‌ఎస్ పార్టీని లాగడం అత్యంత దారుణమైన రాజకీయాలు అని కేటీఆర్ మండిపడ్డారు.

పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ స్వీకరిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాన్నానని, ఎప్పుడైనా డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ఘటు సమాధానం ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ప్రతిపాదనను కూడా స్వాగిస్తున్నానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ముందుండి ఆదర్శంగా నిలబడాలన్నారు. ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరును వాడటంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరైనా తన పేరును డ్రగ్స్ కేసులో లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

