KTR | పలు కార్యక్రమాలతో బిజీబిజీ

KTR | పలు కార్యక్రమాలతో బిజీబిజీ
KTR |ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : మరికాసేపట్లో మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. అక్కడ గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గానికి సన్మానం చేయనున్నారు. అనంతరం క్యాతనపల్లిలో వివిధ సంఘాల నాయకులతో మాట్లాడనున్నారు.
