Krithi Shetty | అక్కడైనా.. సక్సెస్ సాధించేనా..?

Krithi Shetty | అక్కడైనా.. సక్సెస్ సాధించేనా..?
ఆంధ్ర్రప్రభ వెబ్ డెస్క్ : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి ప్రయత్నం(First attempt)లోనే అందం, అభినయంతో ఆకట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత వరుగా ఆఫర్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఈమధ్య కెరీర్ లో వెనకబడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రావడం లేదు(Time is not coming together). ఇలాంటి టైమ్ లో.. ఉప్పెన పాప.. మరో నిర్ణయం తీసుకుందట. ఇంతకీ.. కృతి ఏ నిర్ణయం తీసుకుంది. కెరీర్ పై ఆమెకున్న నమ్మకం ఏంటి..? ఆమె నమ్మకం నిజమయ్యేనా..?
Krithi Shetty | వరుస హిట్స్ తో క్రేజ్..

ఉప్పెన సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కృతి.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్(Blockbuster with the first movie) సాధించడంతో వరుసగా ఆఫర్స్ సొంతం చేసుకుంది. నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగ రాయ్ సినిమలో నటించింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఆతర్వాత కింగ్ నాగార్జున, యువ సమ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా(Bangarraju Movie)లో నటించింది. ఆ సినిమా కూడా సక్సెస్ అందించింది. ఇలా కెరీర్ లో మొదటి మూడు సినిమాలు ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వరుసగా విజయం సాధించడంతో కృతికి మరింత క్రేజ్ పెరిగింది.
Krithi Shetty | అక్కడ నుంచి ప్లాపులు మొదలు..

వరుసగా మూడు సినిమాలు సక్సెస్ సాధించడంతో టాలీవుడ్ లో ఈ కన్నడ భామ(This Kannada actress in Tollywood) మరింత బిజీ అవుతుంది.. మరింత స్పీడుగా సినిమాలు చేస్తుంది అనుకున్నారు. అయితే.. ఆతర్వాత కృతి మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేసింది. నితిన్ తో కలిసి నటించిన ఈ సినిమా ఏమాత్రం(This movie is nothing) ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఇక్కడ నుంచి కృతి కెరీర్ లో ఆలోచనలో పడింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో సుధీర్ బాబుకు జంటగా నటించింది. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ఫరవాలేదు అనిపించింది కానీ.. ఆశించిన స్థాయిలో సక్సెస్(Success at the level) సాధించలేకపోయింది.
Krithi Shetty | బాలీవుడ్ వైపు అడుగులు..

వారియర్, కస్టడీ, మనమే చిత్రాల్లో నటించింది కానీ.. ఏ సినిమా కూడా సరైన సక్సెస్(Proper success) అందివ్వలేదు. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ కార్తీతో సినిమా చేసింది కానీ.. ప్రస్తుతానికి ఆ సినిమా వాయిదా పడింది. అయితే.. కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలి.. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటుంది. అంతే కాకుండా బాలీవుడ్(Bollywood) లో బాగా రాణిస్తానని నమ్మకంగా ఉందట. ఇప్పుడు బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ తో కలిసి ఓ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం. టాలీవుడ్ లో అవకాశాలు లేవు.. కోలీవుడ్ లో ఆఫర్స్(Offers in Kollywood) వస్తున్నప్పుడు అక్కడ దృష్టి పెట్టకుండా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. మరి.. ఈ ఉప్పెన బ్యూటీ నమ్మకం నిజమయ్యేనా..? అక్కడైనా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.

