- నాగార్జున సాగర్ 26 గేట్ల ద్వారా 3,77,162 క్యూసెక్కుల విడుదల
ఉమ్మడి నల్లగొండ బ్యూరో : కృష్ణమ్మ (Krishna) పరవళ్లు తొక్కుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ లోకి వరద నీరు పోటెత్తుతోంది. బుధవారం సాగర్ రిజర్వాయర్ లోకి రికార్డు స్థాయిలో 4,87,037 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో మరింత అప్రమత్తమమైన అధికారులు 26 క్రస్ట్ గేట్లును పది అడుగుల మేర ఎత్తి దిగువకు 3,77,162 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ రిజర్వాయర్ (Sagar Reservoir) పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం రిజర్వాయర్ లో 583 అడుగులకు చేరుకుంది.
ఈ రోజు రాత్రికి ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుకునే అవకాశం…
నాగార్జున సాగర్ (NagarjunaSagar) లోకి ఈ రోజు రాత్రికి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,333 క్యూసెక్కులు, ఎమ్మార్పీ ద్వారా 2400 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 300 క్యూసెక్కుల చొప్పున మొత్తం ప్రాజెక్టు నుండి 4,27,240 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలి పెడుతున్నారు. సాగర్ రిజర్వాయర్ నుండి రికార్డు స్థాయిలో వరద ఉండడంతో సాగర్ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ కలెక్టర్ (Nallagonda Collector) ఇలా త్రిపాఠి హెచ్చరికలు జారీ చేశారు.