కృష్ణ శతకం

79. అది శమంతకమణి అపురూపమైనది
దానినందుకున్న గాన విదుడ
మణులు, రత్నములును, మాణిక్యములు
నీవె గీతదాత నీకు కేలుమోడ్తు

80. నరకమిచ్చు వాడు నరకాసురుండన
ప్రజల కతడి వలన ప్రాణిహింస
నరకవధను చేయ న్యాయమేయగు కదా!
గీతదాత నీకు కేలుమోడ్తు

81. దుష్టశిక్షణకును శిష్టరక్షణకును
యుగయుగమ్ము నందు నుద్భవించి
మంచినిలిపి చెడును త్రెంచెడు దేవుడా
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply