రామగుండం ఆస్ప‌త్రి ఆర్ఎంఓగా కృపాబాయి…

  • ఉత్త‌ర్వులు జారీ

గోదావరిఖని టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులు క‌ల్పించారు. డిప్యూటీ సివిల్ సర్జన్/సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో పనిచేస్తున్న 36 మంది వైద్యులను సివిల్ సర్జన్ (జనరల్ లైన్)గా తాత్కాలికంగా ప్రమోట్ చేస్తూ, పోస్టింగ్‌లను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో డాక్టర్.పి కృపాబాయిని రామగుండం మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో సివిల్ సర్జన్ ఆర్ఎంవో గా నియమితులయ్యారు. గతంలో ఆమె మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా, అలాగే మాతృ ఆరోగ్య విభాగం హెడ్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్క‌డ నియ‌మితులైన డాక్టర్ పి కృపాబాయిని స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది, పౌరసంఘాలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply