Kotagiri Election | ఒక్క చాన్స్ ఇవ్వండి..

Kotagiri Election | ఒక్క చాన్స్ ఇవ్వండి..
ప్రజలకు సేవ చేస్తా..
గ్రామ అభివృద్ధి నా లక్ష్యం..
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గైని నాగమణి మారుతి
Kotagiri Election | కోటగిరి ఆంధ్రప్రభ : మండల కేంద్ర పరిధిలోని ఎత్తోండా క్యాంపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగమణి (Nagamani) మారుతి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఫంక్షన్ హాళ్లను, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించండని కోరారు. ఈ కార్యక్రమంలో పి. సూరిబాబు,అరుణ్ కుమార్ బడంగి, మారుతి శంకర్, రాములు ఎస్ కే హాజం మాణిక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
