కొండా సురేఖ వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి

కొండా సురేఖ వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్‌లో లొల్లి పుట్టింది. భద్రకాళి ఉత్సవ కమిటీ(Bhadrakali Festival Committee)లో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సంబంధం లేకుండా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కమిటీ సభ్యులను ఎంపిక చేయడంపై ఎమ్మెల్యే నాయిని మండి పడ్డారు.

ఎవరి లిమిట్స్‌లో వాళ్లు ఉంటే మంచిదని నాయిని రాజేందర్ రెడ్డి మంత్రి సురేఖను హెచ్చరించారు. ఒక మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్లాల్సింది పోయి, నియోజకవర్గాల్లో(in constituencies) చిచ్చు పెడితే ఎలా? నా నియోజకవర్గంలో ఉండే భద్రకాళి ఆలయంలో మీకు నచ్చిన వారికి కమిటీ సభ్యుల(Committee Members) పదవులు ఇవ్వడం సరికాదనీ, ఈ విషయాన్నిఅధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని నాయిని అన్నారు.

Leave a Reply