Konaseema Saffocated : కోనసీమ గుండెల్లో..Andhra Prabha Spl Sory

Konaseema Saffocated : కోనసీమ గుండెల్లో..Andhra Prabha Spl Sory
ఇరుసుమండలో బ్లోఅవుట్
ఓఎన్జీసీ ఉక్కిరిబిక్కిరి
పల్లెలపై గ్యాస్ దాడి
దట్టమైన పొగతో జనం ఆందోళన
విద్యుత్తు సరఫరా కట్
సురక్షిత ప్రాంతాల్లో మూగజీవులు
మూడు గ్రామాలు ఖాళీ
గ్యాస్ లీకేజీ కట్టడి వరకూ..
పునరావాస కేంద్రాల్లో జనం
సీఎం తక్షణ స్పందన
డిప్యూటీ సీఎం స్వీయ పర్యవేక్షణ
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి )
కోనసీమ గుండెల్లో మరో బ్లోఅవుట్ అలజడి సృష్టిస్తోంది. మూడు గ్రామాల జనం ఊపిరి సలపపి స్థితిలో.. ఊరివి విడిచారు. (Konaseema Saffocated ) మూగ జీవులు అల్లాడిపోతున్నాయి. ఒకవైపు గ్యాస్ వాసన. మరో వైపు దట్టమైన పొగతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ఈ ఊళ్లను,ఊళ్లో జనాన్ని రక్షించమే ధ్యేయంగా.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు. ఇక ఈ మంటల్ని అదుపు చేయటానికి అగ్నిమాపక సిబ్బంది.. ఓఎన్ జీసీ నిపుణులు ఘటన స్థలిలో బ్లో అవుట్ పై పోరాడుతున్నారు.
Konaseema Saffocated : అసలు ఏం జరిగిందటే..

జనవరి 5, 2026, సోమవారం మధ్యాహ్నం మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఈ ప్రమాదం ఉదయం 11:30 నుండి 12:00 గంటల మధ్య ప్రారంభమైంది. సుమారు మధ్యాహ్నం 1:00 గంట సమయానికి గ్యాస్ లీకేజీ తీవ్రత పెరిగింది, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం వెలుగులోకి వచ్చింది. దీప్ ఇండస్ట్రీస్ (Deep Industries) అనే సంస్థ పాత పైప్ లైన్ వద్ద మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా అధిక పీడనంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ గాలిలోకి ఎగిసిపడ్డాయి. గ్యాస్ లీకేజీతో చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. సమీపంలోని విద్యుత్ తీగల నుంచి నిప్పురవ్వలతో మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే ఇరుసుమండ గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అధికారులు ముందు జాగ్రత్తగా మూడు గ్రామాలను ఖాళీ చేయించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ నిపుణుల బృందాలు , ఫైర్ సర్వీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి, అగ్నిప్రమాదాన్ని అదుపు చేసేందుకు ప్రస్తుతం 7 ఫైర్ ఇంజన్లు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయి. రాజమండ్రి, అమలాపురం, కొత్తపేట, రావులపాలెం వంటి ప్రాంతాల నుండి వీటిని తరలించారు.
Konaseema Saffocated : గ్యాస్ పై యుద్ధం..3 గ్రామాలు ఖాళీ

ప్రస్తుతం ఆ బావిని మూసివేసి (Shut down), రిపేర్ పనులు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. ప్రమాద స్థలంలో గాలిలో గ్యాస్ వ్యాపించి ఉన్నందున, సమీప గ్రామాల్లో పొయ్యిలు వెలిగించవద్దని విద్యుత్ పరికరాలను ఆన్ చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు గ్రామాల నుంచి సుమారు 350 నుండి 400 కుటుంబాలను ప్రమాద ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Konaseema Saffocated : సురక్షిత ప్రాంతాలకు జనం తరలింపు

మొత్తం మీద 1,500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసినట్లు అంచనా. ఇరుసుమండ (Irusumanda) : ఇది ప్రమాదం జరిగిన గ్రామం. ఈ ఊరి జనాన్ని పూర్తిగా తరలించారు. మోరి (Mori): గ్యాస్ లీక్ ప్రభావం ఈ గ్రామంపై ఎక్కువగా ఉండటంతో ఇక్కడి కొన్ని వీధులను ఖాళీ చేయించారు. బత్తినవారిపాలెం (Battinavaripalem) గాలి వీస్తున్న దిశను బట్టి ఈ గ్రామాన్ని కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు.

మలికిపురంలోని ప్రభుత్వ హైస్కూల్ , జూనియర్ కాలేజీ భవనాల్లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. దిండి (Dindi) లోని సురక్షిత ప్రాంతాలకు, కొన్ని ఫంక్షన్ హాళ్లకు తరలించారు. మరి కొంత మందిని కొంతమందిని శంకరగుప్తం వైపు ఉన్న సురక్షిత ప్రభుత్వ భవనాల్లోకి తరలించారు. ప్రస్తుతం ఈ బాధితులకు భోజన, వైద్య సదుపాయాలను జిల్లా యంత్రాంగం అందిస్తోంది. బావి నుండి గ్యాస్ లీకేజీ పూర్తిగా ఆగిపోయిందని ఓఎన్‌జీసీ (ONGC) నిపుణులు ధృవీకరించే వరకు వీరిని తిరిగి గ్రామాల్లోకి అనుమతి లేదని ప్రకటించారు.
Konaseema Saffocated : పాశర్లపూడి బ్లోఅవుట్ ఓ పీడకల
కోనసీమ ప్రాంతంలో చమురు , సహజ వాయువు అన్వేషణ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ.. సుమారు 12 పైగా పైగా బ్లో అవుట్ ఘటనలు సంభవించాయి. వీటిలో అతిపెద్దది పాశర్లపూడి బ్లో అవుట్ (1995) అత్యంత భయంకరమైనది. ఇది భారతదేశ చమురు అన్వేషణ చరిత్రలోనే అతిపెద్ద బ్లో అవుట్‌గా రికార్డు సృష్టించింది.
1995, జనవరి 8 న సాయంత్రం సరిగ్గా 6:50 గంటలకు పాశర్లపూడి-19 బావి వద్ద భారీ శబ్దంతో గ్యాస్ ఎగిసిపడి మంటలు ప్రారంభమయ్యాయి. ఈ మంటలు సుమారు 200 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఆకాశం రాత్రి పూట కూడా ఎరుపు రంగులో కనిపించింది. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించినట్లు కనిపించేదని స్థానికులు చెబుతుంటారు. ఓఎన్‌జీసీ (ONGC)కి చెందిన వందలాది మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు 85 రోజులు శ్రమించారు. వీరికి తోడుగా అమెరికాకు చెందిన ప్రముఖ అగ్నిమాపక నిపుణుడు నీల్ ఆడమ్స్ (Neil Adams) బృందం రంగంలోకి దిగింది.
మంటలను అదుపు చేయడానికి సమీపంలోని గోదావరి నది నుండి కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి, నిముషానికి వేల గ్యాలన్ల నీటిని నిరంతరం పంపింగ్ చేశారు. సుమారు ₹15 కోట్లు (అప్పటి విలువ) ఖరీదైన డ్రిల్లింగ్ రిగ్ పూర్తిగా కాలిపోయింది. రోజుకు సుమారు ₹1 కోటి విలువైన గ్యాస్ వృథా అయ్యింది. బావి చుట్టూ 500 మీటర్ల వ్యాసార్థంలో వేలాది కొబ్బరి చెట్లు, పంట పొలాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు.

1995లో ఈ ప్రమాదం జరిగిన సమయంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు (I.Y.R. Krishna Rao) బాధ్యతల్లో ఉన్నారు. ఆయన స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను, ప్రజల తరలింపును పర్యవేక్షించారు.ఈ ఘటన కోనసీమ ప్రజల గుండెల్లో నేటికీ ఒక పీడకలలా నిలిచిపోయింది. 1995 జనవరి 8న మొదలైన ఈ మంటలు, సరిగ్గా 31 ఏళ్ల తర్వాత అంటే జనవరి 5, 2026 న మలికిపురం ప్రాంతంలో జరిగిన ప్రమాదంతో స్థానికులకు ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చాయి.
Konaseema Saffocated : కోన సీమ గుండెల్లో… అదే అలజడి
పాశర్లపూడి బ్లో అవుట్ ఆ కాలంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్లో అవుట్‌గా చరిత్ర సృష్టించింది. ఇకకోనసీమలో జరిగిన కొన్ని ప్రధాన బ్లో అవుట్ లు.. రావులపాలెం మండలంలోని దేవరపల్లి (1993, 1997) సంఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 2005లో తాండవపల్లి (2005) బ్లో అవుట్ సంభవించింది. పరికరాలు దెబ్బతిన్నాయి. నగరం గ్యాస్ పేలుడు (2014) . ఇది బావి బ్లో అవుట్ కాదు కానీ, గెయిల్ (GAIL) పైప్‌లైన్ పేలుడు. ఇందులో 23 మంది మరణించారు, ఇది కోనసీమలో జరిగిన అత్యంత విషాదకర ఘటన.
Konaseema Saffocated : ఒక్క ప్రాణం పోకూడదు : సీఎం తక్షణ స్పందన

మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి (CM), ఉపముఖ్యమంత్రి (Deputy CM) తీవ్రంగా స్పందించారు.
ప్రమాదం సమాచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ , ఓఎన్‌జీసీ (ONGC) ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఏ ఒక్క ప్రాణం పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే మరిన్ని గ్రామాలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. గ్యాస్ లీక్ వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొనే వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.
రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం, ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై ఆరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో మాట్లాడారు. తాము ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడామని… సహాయ చర్యలను ముమ్మరం చేయాలని సూచించినట్టు సీఎంకు మంత్రులు వివరించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని… సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మంటలను వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.
Konaseema Saffocated : Deputy CM స్వీయ పర్యవేక్షణ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా జిల్లా అధికారులతో టచ్‌లో ఉండి, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేలను , అధికారులను కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఓఎన్‌జీసీ శాశ్వత భద్రతా చర్యలు తీసుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు.
కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల , ఎస్పీ రాహుల్ మీనాను ఘటనా స్థలంలోనే ఉండి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిహారం: పంట నష్టం మరియు ఆస్తి నష్టం అంచనా వేయాలని రెవెన్యూ శాఖకు సూచించారు. ప్రస్తుతం మలికిపురం ప్రాంతంలో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Konaseema Saffocated : మంత్రి అచ్చెంనాయుడు ఆరా
రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని కలెక్టర్ ను ఆదేశించారు. తక్షణమే ఓఎన్‌జీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సాంకేతిక నిపుణులచే మంటలను అదుపులోకి తెచ్చేలా చూడాలని స్థానికులు గ్యాస్ ను పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులను ప్రజలకు అందజేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
ALSO READ : CBN Call : గట్టు గొడవలొద్దు Andhra prabha RT News
