Komatireddy | గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహకారం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Komatireddy | మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకూరి రమాదేవి (Ramadevi) భర్త పాలకూరి నరసింహ గౌడ్ ఇవాళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే (Mla) వారిని అభినందించారు. ఈ భేటీలో పాలకూరి రమాదేవి భర్త పాలకూరి నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజ్ పాల్గొని ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, అరబిందో రియాలిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, శ్రీరామోజు వెంకటేశ్వర్లు, బండారు మల్లేష్, నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు.

