IND vs PAK | కోహ్లీ నయా రికార్డు.. సెంచరీతో మ్యాచ్ ముగింపు !
- పాక్ పై ఘన విజయం
- సెమీస్ లో భారత్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షించే ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లో పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి… సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పునరాగమనంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. చాలా రోజులుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లి ఈ మ్యాచ్‌లో (100 నాటౌట్) శతకొట్టాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ కాగా, అంతర్జాతీయంగా 82వ సెంచరీ. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (20), ఓపెనర్ శుభమన్ గిల్ (46), శ్రేయస్ అయ్యార్ (56 తొలి ఛాంపియన్ షిప్ ఫిఫ్టీ) కీలక ఇన్నింగ్ ఆడారు.
ఈ టోర్నీలో వరుస విజయాలు అందుకున్న రోహిత్ సేన… పాయింట్స్ టేబుల్లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానికి చేరుకుంది. దీంతో భారత జట్టు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది.