నాంచారమ్మ తల్లి సేవలో మండలి వెంకట్రామ్..

నాంచారమ్మ తల్లి సేవలో మండలి వెంకట్రామ్..

కోడూరు, ఆంధ్రప్రభ : దివిసీమలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతున్న కోడూరు మండలం విశ్వనాధపల్లిలోని శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఘనంగా జరుగుతోంది. మంగళవారం అమ్మవారి ప్రధాన జాతర మహోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

ఆయనకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోట సూర్య వెంకట నరసింహారావు, దేవస్థానం ఈఓ టీవీవీ మోహనరావు, ధర్మకర్తలు తోట సోమశేఖర్ ఘనంగా సత్కరించారు. ఆలయ పూజారి అమ్మవారి ఆశీస్సులు అందించారు. అనంతరం ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మజ్జిగ పంపిణీ శిబిరాన్ని మండలి వెంకట్రామ్ ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రే గంగయ్య, పిట్టల్లంక సర్పంచ్ కనగాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ కొండవీటి శివరాం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply