ఇరగదీసిన కేఎల్ రాహుల్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో శుక్రవారం (అక్టోబరు 3న) ప్రారంభమైన టీమిండియా (Team India) -వెస్టిండీస్ (West Indies) మొదటి టెస్టు (First Test)లో భారత్ టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించి మ్యాచ్‌పై పటిష్టమైన పట్టు సాధించింది. భారత పేసర్ల దాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
అదరగొట్టాడు..
టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ (KL Rahul )190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది 11వ శతకం కావడం విశేషం. స్వదేశంలో అతడికి ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. తొమ్మిది సంవత్సరాల క్రితం 2016లో చెన్నైలోని చెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 199 పరుగులు సాధించాడు.