కోల్ కతా – కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ లు రెచ్చిపోయారు.. కోల్ కతా స్వంత గ్రౌండ్లో లక్నో బ్యాటర్ లు ధనాధన్ బ్యాటింగ్ చేశారు.. వచ్చిన వాళ్లు వచ్చినట్లు ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు.. దీంతో నిర్ధారిత 20 ఓవర్లలో లక్నో మూడు వికెట్ల 238 పరుగులు చేసింది. కె కె ఆర్ ఈ మ్యాచ్ లో గెలువాలంటే 239 పరుగులు చేయాల్సి ఉంది.
విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ సిక్సర్లు, ఫోర్లతో చివరి ఓవర్లలో స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు….. అతడు 36 బంతులలో 8 సిక్స్ లు, 7 ఫోర్లతో 87 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 45 బంతులలో 81 పరుగులు చేసిన మార్ష్ ను ఆండ్రూ రస్సెల్ ఔట్ చేశాడు.. మార్ష్ స్కోర్ లో ఆరు ఫోర్లు, అయిదు సిక్స్ లు ఉన్నాయి. రెండో వికెట్ గా మాక్రమ్ 47 పరుగులు చేసిన అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.. హర్షిత్ బౌలింగ్ లోనే సమద్ కూడా మూడో పెవిలియన్ కు చేరాడు.. సమద్ 6 పరుగులు చేశాడు.
కె కె ఆర్ బౌలర్లలో హర్షిత్ రాణాకు రెండు వికెట్లు, రస్సెల్ కు ఒక వికెట్ దక్కాయి.