KKR Vs GT – గిల్ శతకం మిస్ – కేకేఆర్ ముందు భారీ టార్గెట్

కోల్ కతా : టేబుల్ టాప‌ర్ గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటర్లు త‌గ్గేదేలే అంటున్నారు. నిల‌క‌డగ ఆడుతూ భారీ స్కోర్ల‌తో విరుచుకుపడుతున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బౌలర్ల‌ను ఉతికేశారు ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(90), సాయి సుద‌ర్శ‌న్‌(52). త‌మ జోడీ ఎంతో ప‌వ‌ర్‌ఫుల్ అని చాటుతూ అదిరే అరంభం ఇచ్చారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ సెంచ‌రీని చేజార్చుకోగా.. ఆఖ‌ర్లో జోస్ బట్ల‌ర్(41 నాటౌట్) మెరుపులు మెరిపించాడు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడ. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

ఇద్దరు జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చి KKR బౌలర్లకు చెమటలు పట్టించారు. 10 ఓవర్లలో, ఇద్దరూ వికెట్ కోల్పోకుండా 89 పరుగులు సాధించారు. గిల్ కేవలం 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే, 13వ ఓవర్‌లో సాయి సుదర్శన్ 52 పరుగుల వద్ద ఔటవడంతో గుజరాత్‌కు తొలి దెబ్బ తగిలింది. గిల్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సులతో 90 పరుగులు చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 199 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Leave a Reply