IPL 2025 | ముగిసిన కేకేఆర్ ఇన్నింగ్స్.. ఆర్సీబీ టార్గెంట్ ఎంతంటే !

ఐపీఎల్ 2025 18వ‌ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కేకేఆర్ – ఆర్సీబీ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుల బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 174/8 ప‌రుగులు సాధించింది.

కేకేఆర్ కొత్త సార‌థి అజింక్య ర‌హానే (56) కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఓపెన‌ర్ సునీల్ న‌రైన్ (44), అంగ్క్రిష్ రఘువంశీ (30) రాణించారు. ఇక ఆర్సీబీ బౌల‌ర్ల‌లో కృణాల్ పాండ్యా మూడు వికెట్లు తీయ‌గా.., జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక యష్ దయాల్, రసిక్ సలామ్, సుయాష్ శర్మ త‌లా ఒక వికెట్ ద‌క్కించుకున్నారు.

దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 175 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగ‌నుంది.

Leave a Reply