అగ్రిటెక్ ద్వారా రైతు చేతిలో సాంకేతికత

అగ్రిటెక్ ద్వారా రైతు చేతిలో సాంకేతికత

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : సాంకేతికతో నే ఖర్చు తగ్గించుట, దిగుబడి పెంచుట, నష్టాన్ని తగ్గించటంఫై దృష్టి సారిస్తూ వ్యవసాయంలో డీప్ టెక్ కృత్రిమ మేధస్సు, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి వస్తున్నాయని ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని షేక్ షాన్ పల్లి గ్రామంలో మంగళవారం రైతన్నా నీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల పంచ సూత్రాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు గురించి, ఇంటింటా తిరుగుతూ రైతులకు అవగాహన కల్పించారు. రైతన్నా మీకోసం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య రైతు ఐ డి ఇవ్వడం ద్వారా ప్రతి రైతు వివరాలను ఒక సమగ్ర డిజిటల్ వ్యవస్థలోకి తీసుకొని రావడం, భూమి, రైతు పంట సేవలు, అన్ని ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

రైతుకు సేవలు వేగంగా అందటమే కాకుండా, పథకాల అమలు సులభం అవుతుందని తెలిపారు. ఈ పంట ద్వారా సాగు విస్తీర్ణాన్ని డిజిటల్ గా నమోదు చేస్తూ పారిదర్శకత ను పెంచుతూ, రైతుల స్వయంగా పంట బుకింగ్ చేసుకునే సదుపాయం కూడా ఫార్మర్ యాప్ ఏ పీ ఎయిమ్స్ 2.0 అందుబాటులో ఉంచడం, పంటల్లో వచ్చే చీడపీడలను, గుర్తించటానికి ఏఐ ఆధారిత బెస్ట్ సర్వలెన్స్ వ్యవస్థను వినియోగించడం ద్వారా రైతులకు సమయాన్ని కూలంగా వ్యవసాయ సలహాలు, హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపిస్తూ పంట నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం అన్నారు.

రైతులకు యాప్ ద్వారా వాతావరణ సమాచారం, పంట సలహాలు, మార్కెటింగ్ ధరలు, తెగుళ్లు చీడ పీడల వ్యాప్తి హెచ్చరికలు, ప్రభుత్వ పథకాల వివరాలు ఒకటే వేదికలో అందించడం, కిసాన్ డ్రోన్లు, వ్యవసాయ యంత్రాల ఉబరైజేషన్ ద్వారా అవసర మైన ప్రదేశంలో యంత్రాలను అద్దెకు పొందే విధంగా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా సేవలు అందించడం తెలిపారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి భరత్ రాజ్, ఉద్యాన వ్యవసాయ సహాయకులు రాజేశ్వరి పాల్గొన్నారు.

Leave a Reply