Kinjarapu Atchannaidu | భక్తుల కోసం…

Kinjarapu Atchannaidu | భక్తుల కోసం…

Kinjarapu Atchannaidu | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి వంటి అత్యంత పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను సోమవారం ఆదేశించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని సాఫీగా, సులభంగా చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూలైన్ల పకడ్బందీ నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎక్కడా తోపులాటలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, భక్తుల ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పోలీస్‌, రెవెన్యూ శాఖలతో పాటు దేవాదాయ శాఖ, మున్సిపల్‌ అధికారులు సహా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి, భక్తులకు ప్రశాంతమైన, భక్తి భావంతో కూడిన దర్శన అనుభూతి కల్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply