ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూసుకెళ్లాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అజేయ సెంచరీ సాధించిన కోహ్లీ… వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కి నెట్టి గిల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమిండియా మిడిలార్డర్ బ్యాక్ బోన్ శ్రేయాస్ అయ్యర్ 679 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఓవరాల్ గా టాప్-10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు ఉండటం విశేషం.
ఐసీసీ వన్డే టాప్-5 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే
- శుభమన్ గిల్ (భారత్) – 817 పాయింట్లు
- బాబర్ ఆజం (పాకిస్థాన్) – 770 పాయింట్లు
- రోహిత్ శర్మ (భారత్) – 757 పాయింట్లు
- హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) – 749 పాయింట్లు
- విరాట్ కోహ్లీ (భారత్) – 743 రేటింగ్ పాయింట్లు