Key Meeting | మీనాక్షితో కొండా ముర‌ళీ దంప‌తులు భేటి – వివాదాల‌పై 16 పేజీల లేఖ అంద‌జేత‌

బిసి వ‌ర్గాల‌కు నేనే ప్ర‌తినిధిని
రాహుల్ ను ప్ర‌ధాని చేయ‌డ‌మే నా ధ్యేయ‌మ‌న్న ముర‌ళి

హైద‌రాబాద్ – వ‌రంగ‌ల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ వివాదాల నేప‌థ్యంలో కొండా ముర‌ళి. సురేఖ దంప‌తులు నేడు కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ సమర్పించారు. కాగా, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా ముర‌ళీ విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీలు మీనాక్షిని క‌ల‌సి త‌మ వాద‌న‌లను వినిపించారు.

ఈ సంద‌ర్బంగా కొండా ముర‌ళీ మీడియాతో మాట్లాడుతూ, తాను వెనకబడిన వర్గాల ప్రతినిధిన‌ని.. నలభై నాలుగు ఏండ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంద‌ని అన్నారు.. ఒకరి గురించి నేను కామెంట్ చేయనంటూ త‌న‌కు ప్రజాబలం ఉంద‌న్నారు.. త‌న‌కు భయపడకపోతే నాపై 23 కేసులు పెట్టకపోయేవాళ్ళుకాద‌న్నారు… పోటా, టడా కేసులకే తాను భయపడలేద‌ని అన్నారు. .. వ‌రంగ‌ల్ జిల్లా వివాదాలు ప్ర‌స్తుతం క్రమశిక్షణ కమిటి పరిధిలో ఉన్నద‌ని అన్నారు.. అయినా త‌న‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నార‌ని వివ‌రించారు…. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన బొంగెం కాదు అనే వ్యాఖ్యలను ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు చెప్పారు.

ఇక రేపు జరగబోయే మీటింగ్ పై చర్చించామ‌న్నారు.. రేపు వరంగల్ నుంచి ఎంత మంది వస్తారు అనేది చర్చించామ‌ని పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీ నీ బ్రతికించడం, రాహుల్ గాంధీ నీ ప్రధాని చేయడం నా ఉద్దేశమ‌ని ముర‌ళీ అన్నారు… పని చేసే వాళ్లపైనే రాళ్ళు విసురుతారని పేర్కొన్నారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలిచేలా.. ఎమ్మెల్యేలను మళ్ళీ వరంగల్ లో గెలిపించడం నా బాధ్యత అన్నారు…తాను బీసీ కార్డు పైనే బ్రతుకుతున్నాన‌ని, రోజు 500 మంది ప్రజలకు భోజనం పెడతాన‌ని చెప్పారు… ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందు ఉంటాను కాబట్టి ప్రజలు వస్తున్నారు.. ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో త‌న‌కు సంబంధం లేదంటూ త‌న కుమార్తె ఎక్కడి నుంచి పోటీ చేయడం లేద‌న్నారు.

Leave a Reply