Keerthy Suresh | చిరంజీవి గారంటే గౌరవం కానీ..?

Keerthy Suresh | చిరంజీవి గారంటే గౌరవం కానీ..?
Keerthy Suresh, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కథనాయిక కీర్తి సురేష్.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. మహానటి సినిమాలో అలనాటి నటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆమధ్య తమిళ హీరో విజయ్, తెలుగు హీరో చిరంజీవి ఇద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని అడిగితే.. విజయ్ అని చెప్పింది. అది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. కీర్తి సురేష్ పై మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం జరిగింది.
ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ రివాల్వర్ రీటా (Revolver Rita). ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ లో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఓ జర్నలిస్ట్.. చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అనే దాని గురించి వివరణ అడిగితే.. ఎవర్నీ తక్కువ చేసే ఉద్దేశ్యం తనకు లేదన్నారు కీర్తి సురేష్. విజయ్ సర్ కి చాలా పెద్ద అభిమానిని. ఈ విషయం చిరంజీవికి (Chiranjeevi) గారికి కూడా తెలుసు. భోళా శంకర్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ విషయం గురించి చిరంజీవి గారు, నేను సరదాగా మాట్లాడుకుని నవ్వుకున్నాం. చిరంజీవి సర్ అంటే గౌరవం ఉంది అని చెప్పారు. చిరంజీవి అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే.. సారీ అని చెప్పారు. కీర్తి సురేష్ చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
