ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు..

నిజాంపేట, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని నందిగామ గ్రామం తో పాటు మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జన్మదినం సందర్భంగా నిజాంపేట,నందిగామ గ్రామ బిఆర్ఎస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎవరికి విమర్శించిన కాంగ్రెస్ నాయకుల్లారా కేసీఆర్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. రానున్నది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే అని కెసిఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేరన్నారు. రానున్న జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తామని వారు దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడులు శ్రీనివాస్ గౌడ్,చల్మేటి నాగరాజు,మాజీ ఎంపీపీ బీజ్జాసంపత్, మాజీ సర్పంచ్ సంగు స్వామి, రెడ్డి శెట్టి రవీందర్,మాజీ ఎంపీటీసీ బాల్రెడ్డి,మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, బిఆర్ఎస్వి అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్,రాములు గౌడ్,నాయిని లక్ష్మణ్,శ్రీకాంత్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గెల్లు రాజ్యం, భాజ తిరుమల్, గుర్రం కృష్ణ గౌడ్, ఆకుల రాములు స్వామి,నరేందర్, శివ,తిరుమల గౌడ్,మల్లేశం, రాగుల బాబు, రాజు గౌడ్, ప్రణయ్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
