అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన కేసీఆర్

అజ్మీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా, ప్రతి ఏటా పార్టీ తరఫున దర్గాకు చాదర్ సమర్పించే ఆచారం ఈ ఏడాది కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనసాగించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ ఆయన ఈ పవిత్ర చాదర్‌ను సమర్పించారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం, మైనారిటీ నేతల బృందానికి చాదర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర మైనారిటీ నాయకులు కేసీఆర్ వెంట ఉన్నారు.

గంగా-జమునా తెహజీబ్ (మత సామరస్యం)కు ప్రతీకగా నిలిచే ఈ సంప్రదాయాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుండి నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. అజ్మీర్ దర్గాలో జరిగే వార్షిక ఉర్సు ఉత్సవాల్లో తెలంగాణ ప్రజల తరఫున ఈ చాదర్‌ను మైనారిటీ నేతలు దర్గా ప్రతినిధులకు సమర్పించనున్నారు.

Leave a Reply