KCR | నేతలు, న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు

KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. అయితే నోటీసులపై కేసీఆర్, పార్టీ నేతలు, న్యాయవాదులతో కలిసి ఇవాళ ఎర్రవల్లిలో సమాలోచనలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు నిన్నటి నుంచి ఎర్రవల్లిలోనే ఉన్నారు. రేపటి సిట్ విచారణ అంశంపై చర్చిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో తాను ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అక్కడకు రాలేమని చెబుతూ హైదరాబాద్‌లోనే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొంది.
