KCR | బీఆర్ఎస్ లో భారీ చేరికలు
KCR | గీసుగొండ, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడం ఖాయమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గీసుగొండ మండలం వంచనగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, సొసైటీ డైరెక్టర్ కౌడగాని స్వప్న శ్రీనివాస్ కాంగ్రెస్స్ పార్టీని వీడి పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

