Kavitha | కాంగ్రెస్ మైనారిటీల సంక్షేమాన్ని మరచిపోయింది..

  • ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : బీఆర్ఎస్ అంటే మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసుల్లో కేసీఆర్ ఉన్నాడని.. తెలంగాణ భవి ష్యత్తు కేసీఆర్ దేనని అన్నారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీలకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగిందన్నారు., మసీదుల అభివృద్ధికి అనేక నిధులు కేటాయించి, మైనారిటీల సంక్షేమానికి కృషి చేశామ‌ని గుర్తు చేశారు.

రంజాన్ పండుగ సందర్భంగా, కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు పండుగ తోఫా ఏది అని ప్రశ్నించారు. మైనారిటీల సంక్షేమం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి కలలో కూడా కెసిఆర్ నే క‌ల‌వ‌రిస్తుండు..

రేవంత్ కళలో కూడా కెసిఆర్ ని కలవరి స్తున్నారని క‌విత అన్నారు. రైతు బంధు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉట్టి మాటలతో టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు కానీ.. సొల్లు మాటలు మాత్రం బాగా చెబుతావని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో అబద్దాలు మాట్లాడి పాపం మూటకట్టుకోవద్దని క‌విత‌ హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల షకీల్ సతీమణి అయేషా, విజీ గౌడ్, మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, అలీం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *