కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..

కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ శాసనసభలో మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతుండగా భారాస పార్టీ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అసభ్యకరంగా అవమానకరంగా అనుచితంగా వ్యవరించి గన్ తో కాల్చిపడేస్తానంటూ చేయితో సైగలు చేస్తూ బెదిరించడం.. ఈ హేయమైన చర్యను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు చింతల నరేష్ ఖండించారు.
ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి 40 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ రాష్ట్రంలో అనేక శాఖలలో మంత్రిగా పని చేసారు. అవినీతి మరకలేని నాయకుడుగా పేరు తెచ్చుకున్న నీతి నిజాయితీ, నిబద్దత గల ఒక శాసనసభ్యున్ని పట్టుకొని నిండు శాసనసభలో అనుచితంగా వ్యవహరించారు. సభా మర్యాదలకు విలువ ఇవ్వని కౌశిక్ రెడ్డిని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
