9వ వార్డులో స్పీడ్ పెంచిన కట్ల సంతోష్..

9వ వార్డులో స్పీడ్ పెంచిన కట్ల సంతోష్..

  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు పై సర్వత్ర చర్చ..

వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో టిడిపి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కట్ల సంతోష్ గెలుపు పై సర్వత్ర చర్చ జరుగుతుంది.. యువ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘమైన ఎన్ ఎస్ యు ఐ లో రాష్ట్రస్థాయి నేత వరకు కృషిచేసిన ఆయన తనదైన శైలిలో ప్రచారంలో స్పీడ్ పెంచారు.. యువకుడిగా విద్యావంతుడుగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరొందిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో… కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా క్రియాశీలకంగా పని చేశారు..

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆయనను గుర్తించి 9వ వార్డులో పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం కల్పించింది… సేవ భావంతో ఆ వార్డుకు అంకితభావంతో సేవలందించాలనే దృఢ సంకల్పంతో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి… కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డును మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు… గెలుపు దిశగా 9 వ వార్డులో ప్రచారం జోరు అందుకుంది.. టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు..

Leave a Reply