హైదరాబాద్, ఆంధ్రప్రభ : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేష్రన్, అర్బన్ డెవలప్మెంట్‌శాఖల్లో కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్ కానుంది. ఈ శాఖలో ఏళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి మేలు జరగనుంది.
ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భర్తీ కానున్నాయి. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను ఈ నెల 19న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కారుణ్య అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందజేయనున్నారు.
ఇందుకోసం ఈ నెల 19న రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. పంచాయతీరాజ్‌శాఖలో 588 కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీరందరికీ 19న ఉద్యోగ నియామకపత్రాలను సీఎం అందజేయనున్నారు.
2016 నుంచి వీరంతా పంచాయతీరాజ్‌శాఖలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూసున్నారు. ఈ విషయంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఆర్థికశాఖ నియామకాలకు అనుమతి ఇచ్చింది.