వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
నకిరేకల్, నవంబర్ 5 (ఆంధ్రప్రభ) : కార్తీక పౌర్ణమి (Karthika Pournami) పర్వదినం సందర్భంగా గీత మందిరం, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, సాయిబాబా ఆలయంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయా దేవాలయాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో దేవాలయ చైర్మన్లు పబ్బతి వెంకన్న, ఉప్పల రమేష్, వనమా వెంకటేశ్వర్లు, గుండా వెంకటయ్య, కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.

