Karimnagar | నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల

Karimnagar | నియోజకవర్గ ఇన్చార్జిగా వెలిచాల
- ఉత్తర్వులు జారీచేసిన మహేష్ కుమార్ గౌడ్
కరీంనగర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు ను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజేందర్రావు చేసిన సేవలను గుర్తించి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.

తనపై నమ్మకం నుంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజేందర్ రావు నియామకం పట్ల కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
