Karimabad | త్రాగునీటి సమస్య పరిష్కరించాలి…

Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని శివనగర్ లో భగీరథ త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు మేయర్, కమిషనర్ చొరవ తీసుకొని పరిష్కరించాలని కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 34 డివిజన్ 35 డివిజన్లో త్రాగునీరు సక్రమంగా పంపిణీ కాక తీవ్ర ఇబ్బందులు, ప్రతిచోట లీకేజీలు, డివిజన్లో కోతులు, కుక్కల బెడద,తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు స్థానిక కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామిని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత సంవత్సర కాలం నుండి భగీరథ త్రాగునీరు సక్రమంగా పంపిణీ కావడం లేదని మరికొన్ని వీధుల్లో నాలుగు సంవత్సరాల నుండి కూడా భగీరథ త్రాగునీరు పంపిణీ కావడం లేదని, కొన్ని చోట్ల డ్రైనేజీ లలో విద్యుత్ ట్రాన్స్ఫారాలు, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు కార్పొరేటర్ దిద్ది కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సమస్యను మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ డీకే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పోలేపాక రాజు, బిల్లా రాజు, మీసా శ్రీకాంత్ బత్తుల రామకృష్ణ కొండి శ్రీనివాస్ పెద్దూరి పెద్దన్న, పత్తి రాజమణి పాల్గొన్నారు.
