అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ ద‌ర్శ‌నం

అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ ద‌ర్శ‌నం

  • వైభవంగా కొనసాగుతున్నదసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
  • మూడో రోజు ముచ్చట గొలిపే అలంకరణలో అమ్మవారు
  • ఇంద్రకీలాద్రికి పెరుగుతున్నభక్తుల రద్దీ
  • క్యూలైన్లలో భవానీల కోలాహలం
  • కిటకిటలాడుతున్నఆల‌య ప‌రిస‌రాలు
  • ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ గోల్డ్ మెన్
  • ఆంక్షలు ఉన్నతప్పని వీఐపీల తాకిడి
  • నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తున్న‌కలెక్టర్ లక్ష్మీశ, ఈవో శీనా నాయక్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్ర : ఒక చేతిలో బంగారు అక్షయపాత్ర.. మరో చేతిలో వజ్రాల గంట పట్టి… ఆది బిక్షువుడికి బిక్ష సమర్పిస్తున్నట్లుగా తేజావంతమైన దివ్య మంగళ స్వరూపిణి శ్రీ అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ(Kanakadurgamma) భక్తులకు అభయం ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

ఉత్సవాల్లో మూడవరోజు కనకదుర్గమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నజగజ్జనని(Jagajjanani) కనులారా దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు భవానీలు వీఐపీలు, పెద్ద ఎత్తున తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. విజయవాడ తోపాటు పలు జిల్లాల నుండి రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది.

కోలాహలంగా ఇంద్రకీలాద్రి…

శరన్నవరాత్రి ఉత్సవాలలో అన్నపూర్ణాదేవి(Annapurnadevi) అలంకరణలో ఉన్నకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండాలుగా ఇంద్రకీలాద్రికి రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహాలంగా కనిపిస్తోంది. కెనాల్ రోడ్‌లోని వినాయకుడి వద్ద నుండి ప్రారంభమవుతున్నక్యూ లైన్‌ల ద్వారా భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి(Indrakiladri) ఘాట్ రోడ్డుపై మీదుగా తరలివస్తున్నారు. గంట గంటకు భక్తుల రాక పెరుగుతుండడం వీరికి భవానీల సైతం తోడు కావడంతో క్యూ లైన్ లన్నీ(all the queue lines) కిక్కిరిస్తున్నాయి. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం క్యూలైన్లలో తాగునీరు పాలు బిస్కెట్లు వంటి సరఫరా చేస్తుండడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నకనకదుర్గమ్మవారిని దర్శించుకున్నఅనంతరం భక్తులు అమ్మవారి ప్రసాదమైన అన్నప్రసాదాన్నిపెద్ద ఎత్తున స్వీకరిస్తున్నారు. కనకదుర్గ నగర్‌(Kanakadurga Nagar)లో కొత్తగా ప్రారంభించిన అన్న ప్రసాదం భవనంలో భక్తులందరికీ అత్యంత రుచికరమైన అమ్మవారి ప్రసాదాన్నిఅందిస్తున్నారు. అలాగే కనకదుర్గ నగర్ లో ఏర్పాటు చేసిన సుబ్బారు 10 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాద్ దాన్ని సైతం భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తూ..

దసరా మహోత్సవాలకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయా.. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా.. ఇలా భక్తులతో మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చి సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నారు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ(Dr. G. Lakshma). అప్పుడు ఇప్పుడు అని కాదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని కాదు.. ప్రతిచోటకు చురుగ్గా కదులుతూ క్యూ లైన్ లలో సైతం భక్తులతో కలసి అడుగులు వేస్తూ ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

సమస్యలు ఏవైనా అక్కడికి అక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిఒక్కరికి సంతృప్తికరంగా అమ్మను దర్శించుకునేలా దిశా నిర్దేశం చేస్తున్నారు. 11 రోజులపాటు(for 11 days) కొనసాగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అక్కడికక్కడే…అప్పటికప్పుడే… శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలను భక్తులు ప్రశంసిస్తున్నారు.

ప్రధానంగా దర్శనం కోసం భక్తులు వేచి చూచే సమయం తగ్గించడం… దర్శనానంతరం… లడ్డు ప్రసాదాల.. విక్రయ కేంద్రాల వద్ద రద్దీని నివారించడం… అన్న ప్రసాదం నిర్వహించే కేంద్రాలలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 36 సెక్టార్లలో(Rs. 36 sectors) వందల మంది సిబ్బంది మధ్య సమన్వయం సాధించి మహోత్కృష్టమైన రాష్ట్ర పండుగను అమ్మవారిని దర్శించుకున్నప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా గుర్తుంచుకునేలా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలను ప్రతి భక్తుడు అభినందించడం విశేషం.

గోల్డ్ మ‌న్‌గా పేరుపొందిన తెలంగాణ ప్రాంతం హైదరాబాద్‌ శేర్లింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్(Vijay Kumar) విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నపూర్ణ దేవి అలంకరణలో ఉన్నకనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు ఆయన క్యూలైన్ల ద్వారా అమ్మవారి ఆలయానికి చేరుకోవడంతో ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.

అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఉత్సవాల ప్రత్యేక అధికారి భ్రమరాంబ విజయ్ కుమార్ కు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. సుమారు 8 కేజీల బంగారు(8 kg gold) ఆభరణాలు ధరించి ఉన్నవిజయ్ కుమార్ కలుసుకునేందుకు ఫోటోలు తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి సెల్ఫీలు ఇస్తూ, ఫోటోలు తీసుకుంటూ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా విజయ్ కుమార్ నిలిచారు.

అమ్మవారి దర్శనానికి రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారని వారికి అమ్మవారి దర్శనం లభించేలా స్థానికులు సహకరించాలని దుర్గగుడి చైర్మన్ గా నియమితులైన బొర్రా రాధాకృష్ణ(Borra Radhakrishna) (గాంధీ) కోరారు.

మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ… స్థానికులు పలుమార్లు దర్శనం చేసుకోవడం వల్ల, దూర ప్రాంతాల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇతరులకు దర్శన భాగ్యం దక్కేలా అందరూ సహకరించాలని కోరారు. విఐపీలు సైతం ఒకరికే పలుమార్లు పాసులు జారీ చేయకుండా, కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు.

తనను దుర్గ గుడి చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గంటలోపుగా ఉచిత దర్శనం పూర్తవుతోందని, దీంతో సామాన్య భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

అన్నపూర్ణ దేవి అలంకరణలో ఉన్నకనకదుర్గమ్మ వారిని మూడవరోజు బుధవారం పెద్ద ఎత్తున ప్రముఖులు దర్శించుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishnamraju), ఎమ్మెల్యే గౌత శిరీష తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్జిలు రాజకీయ సినీ రంగ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a Reply