Kamareddy | నాటు బాంబు కలకలం

Kamareddy | నాటు బాంబు కలకలం

  • గర్గుల్‌లో నాటు బాంబు పేలి కుక్క మృతి

Kamareddy | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో నాటు బాంబు పేలిన ఘటనలో ఓ కుక్క మృతి చెందింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మొగుళ్ల సాయాగౌడ్‌కు చెందిన పంట చేనులో శనివారం ఉదయం సమయంలో సాయాగౌడ్ తమ్ముడు రామా గౌడ్ నీళ్లు పారించడానికి వెళ్లాడు. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో వెళ్లి చూడగా ఓ కుక్క తల పగిలి మృతి చెందింది. చుట్టుపక్కల చూడగా పొగ రావడాన్ని గమనించగా నాటు బాంబులు పేలినట్టు గుర్తించారు.

గుర్తు తెలియని వ్యక్తులు తమ పంట చేనులో బాంబులు పడేసి ఉండొచ్చ‌ని, బాంబును కుక్క నోట పట్టుకోవడంతో అది పేలి తలపగిలి మృతి చెందిన‌ట్లు అనుమానిస్తున్నారు. తమకు హాని చేయడానికే బాంబులు పడేసి ఉంటారని రైతు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చేనులో బాంబులు పడేసి తమకు హాని కలిగించాలని ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని సాయాగౌడ్ తో పాటు చుట్టుపక్కల రైతులు కోరుతున్నారు. కాగా పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అడవి పందుల కోసం ఎవరైనా పెట్టి ఉంటారా, లేదా కావాలని పెట్టారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.

Leave a Reply