Kamalapur | అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

Kamalapur | అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

జోరందుకున్న పార్టీల ఫిరాయింపు
సర్పంచ్ పదవుల కోసం పార్టీల మార్పు


Kamalapur | కమలాపూర్ : హనుమకొండ (Hanumakonda) జిల్లా కమలాపూర్ మండలంలో పార్టీల ఫిరాయింపు పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ (BRS) లోకి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ (Congress) లోకి వలసలు జోరందుకున్నాయి. గ్రామ సర్పంచ్, వార్డు పదవుల కోసం పార్టీలు మారుతూ పోటీకి సిద్ధపడుతున్నారు.

తాజాగా మండలంలోని కన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుల్లూరి శ్రీనివాసరావు ఈరోజు తన అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన కన్నూరు సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ చేరికల కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ రావుతో పాటు స్థానిక నాయకులు తదితరులున్నారు.

Leave a Reply