5వ వార్డులో ‘కమలం’ వికాసం..

5వ వార్డులో ‘కమలం’ వికాసం..

  • బోయిని నారాయణ ప్రచార ప్రభంజనం
  • వార్డు ప్రజల కష్టసుఖాల్లో తోడుంటానని అభ్యర్థి నారాయణ భరోసా

మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో 5వ వార్డు బీజేపీ అభ్యర్థి బోయిని నారాయణ తనదైన శైలిలో దూకుడుతో ప్రచారంలో అందరికంటే ముందున్నారు. శనివారం వార్డులోని వివిధ కాలనీల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, వార్డు అభివృద్ధి కోసం తపించే నాయకుడిగా నారాయణకు ఓటర్ల నుండి విశేష మద్దతు లభిస్తోంది. ప్రజా క్షేత్రంలో కమలం హోరు ప్రచారంలో భాగంగా బోయిని నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అదే స్ఫూర్తితో 5వ వార్డును కూడా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేస్తానని ఓటర్లకు వివరించారు. ముఖ్యంగా వార్డులోని డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. యువత పెద్ద ఎత్తున మద్దతు తెలపడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధిని కాంక్షించే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

Leave a Reply