Kalyan,Tanuja | సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న బిగ్‌బాస్ జంట‌

Kalyan,Tanuja | సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న బిగ్‌బాస్ జంట‌

Kalyan,Tanuja | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌-9 హౌస్‌లో ఏది జ‌రిగినా.. బ‌య‌ట ఏదీ జ‌రిగినా స‌మ్ థింగ్ స్పెష‌ల్ అంటూ సంచ‌ల‌నం రేక‌త్తిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ జరిగిన బిగ్‌బాస్ సీజ‌న్‌లు ఒక ఎత్తు. సీజ‌న్‌-9 మ‌రో ఎత్తు అని చెప్పాలి. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లో (BiggBoss House) ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం క‌న‌బ‌రిచిన క‌ళ్యాణ్ ప‌డాల‌, త‌నూజ ఇద్ద‌రి బాండింగ్‌పై బిగ్ బాస్ ప్రేక్ష‌కులు నిరంత‌రం చ‌ర్చించుకున్నారు. వారిద్ద‌రి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారి కోసం ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ జ‌రుగుతునే ఉంది.

Kalyan,Tanuja

Kalyan,Tanuja | వారిద్ద‌రిని ప‌ట్టించుకోని ప్రేక్ష‌కులు వీరిద్ద‌రిపై…

ఎప్పుడైనా బిగ్ బాస్ విన్నర్ కు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి విన్నర్ తో పాటు రన్నర్ ను కూడా స్టార్ ను చేశారు. ఈ సీజన్ లో విన్నర్ గా గెలిచిన కళ్యాణ్ పడాలతో పాటు.. రన్నర్ గా (Runner) నిలిచిన తనూజ కు కూడా అంతే స్టార్ డమ్ వచ్చింది. దాంతో పాటు వీరి మధ్య ఉన్న బంధంర‌పై కూడా ప్ర‌త్యేక దృష్టి సారించారు బిగ్ బాస్ ప్రేక్ష‌కులు. హౌస్ లో అందరికి కనిపించిన ప్రేమ జంట రీతూ చౌద‌రి, డెమాన్ ప‌వ‌న్‌. వీర‌ద్ద‌రి కోసం ప్రేక్ష‌కులు విడిచిపెట్టారు. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ ప‌డాల‌, త‌నుజా పుట్ట‌స్వామి పై బిగ్‌బాస్ ప్రేక్షుకులు చ‌ర్చించుకుంటున్నారు.

Kalyan,Tanuja

Kalyan,Tanuja | ఎక్క‌డా హ‌ద్దు దాట‌ని జంట‌…

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా కళ్యాణ్–తనూజ మధ్య ప్రత్యేకమైన బంధం కనిపించేది. పెద్ద గొడవలు లేకుండా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆట ఆడటం వీరి ప్రత్యేకత. అదే సమయంలో డైరెక్ట్‌గా ప్రేమని ప్రకటించకుండా, ఎప్పుడూ హద్దులు దాటని విధంగా వ్యవహరించడంతో ఆడియెన్స్ మరింత ద‌గ్గ‌ర‌య్యారు. బిగ్‌బాస్ తర్వాత తనూజ ఇప్పటికే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. పలు సందర్భాల్లో ఆమె “కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే” అని చెప్పింది. రిలేషన్‌షిప్ (Relationship) గురించి వస్తున్న వార్తలను ఖండించింది. అయినా సరే, కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ బంధంపై మళ్లీ చర్చలు మొదలయ్యేలా చేశాయి. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్‌లపై ఫోకస్ చేస్తున్నప్పటికీ, అభిమానుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.

Kalyan,Tanuja

Kalyan,Tanuja | సంక్రాంతి ఈవెంట్‌లో సంద‌డి చేశారు…

తనూజ-కళ్యాణ్ ఇద్దరూ ఒక చానెల్‌ సంక్రాంతి ఈవెంట్‌ లో సందడి చేశారు. దీనికి సబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ (Kalyan) పడాల, తనూజ ఇద్దరు స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు. తనూజ గురించి కళ్యాణ్ తన మనసులో మాట బయట పెట్టాడు. ”తనూజ నాకు దొరకడం నిజంగా అదృష్టం అనే అనుకుంటున్నాను.. నా లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా థాంక్స్” అంటూ కళ్యాణ్ చెప్పగానే తనూజ సర్‌ప్రైజ్ అయింది. ఈ సీన్ చూసి.. కళ్యాణ్ తనూజకు ప్రపోజ్ చేశాడా? అని అనుమానాలు రేక‌త్తిస్తున్నాయి.

Kalyan,Tanuja
Kalyan,Tanuja

CLICK HERE TO READ అనిల్ మరోసారి మ్యాజిక్ చేశాడా…?

CLICK HERE TO READ MORE

Leave a Reply