స‌భ‌కు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చారు. పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లుతో పాటు అల్లోపతిక్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.

సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ మొదలైంది. చర్చ జరుగుతున్నందున ఆర్డినెన్స్‌ కుదరదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ చట్టం తెచ్చినట్లు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నారు. దీని కోసమే ఈ బిల్లు తెచ్చినట్లు తెలిపారు. ఈ రిజర్వేషన్ల బిల్లు బీసీ వర్గాలకు ఎన్నికలలో మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది.

Leave a Reply