KAKANI | మళ్లీ నోరుజారారు
- మాజీ మంత్రి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు
KAKANI | ఆంధ్రప్రభ, నెల్లూరు : మాజీ మంత్రి, వైసీపీ (YCP) కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కాకణిపై ఆదివారం మరో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే (MLA) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కాకణిపై కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

