KADEM | సీఎంని కలిసిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు సతీష్ రెడ్డి

KADEM | కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పొద్దుటూరి సతీష్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు. కడెం ప్రాజెక్టు మరమ్మతుల పనులకు రూ. 9 కోట్ల 45 లక్షల నిధులు మంజూరు చేయించి కడం ప్రాజెక్ట్ ఆయకట్టు రెండు పంటలకు సాగునీరు అందించేలా కృషి చేసిన సీఎంకు సతీష్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
